ఏడాది దాటినా సర్కారు పట్టించుకోవడం లేదు

ఏడాది దాటినా సర్కారు పట్టించుకోవడం లేదు
  • పట్టించుకోని రాష్ట్ర సర్కారు
  • పెండింగ్లో 5వేలకు పైగా కేసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పత్తాలేకుండా పోయింది. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ కుర్చీ ఖాళీ అయ్యి ఏడాది దాటినా సర్కారు పట్టించుకోవడం లేదు. మరో వైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్‌‌‌‌లో మూలుగుతున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 2018లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేసి, చైర్మన్‌‌‌‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన పదవీకాలం ముగిసింది. ఇప్పటికీ కొత్త చైర్మన్‌‌‌‌, సభ్యులను నియమించలేదు. దీంతో పలు కేసుల్లో నేషనల్‌‌‌‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌ విచారణ చేపట్టాల్సి వస్తోంది.
పెండింగ్‌లో 5 వేలకుపైగా కేసులు
ఎస్సీ, ఎస్టీలపై దాడులు, భూముల ఆక్రమణ, దూషణలు తదితర అంశాలపై కమిషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో కంప్లయింట్‌‌‌‌ చేస్తున్నా న్యాయం జరగడం లేదు. ఇప్పటి వరకు 5 వేలకు పైగా ఫిర్యాదులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.