ఎస్సీలకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచండి : బక్కి వెంకటయ్య

ఎస్సీలకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచండి : బక్కి వెంకటయ్య
  • మంత్రి సీతక్కకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వినతి 

హైదరాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లను18 శాతానికి పెంచాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మంత్రి సీతక్కకు విన్నవించారు. ఆదివారం హైదరాబాద్​లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్​లోని మంత్రి నివాసంలో సీతక్కను బక్కి వెంకటయ్య కలిశారు. రిజర్వేషన్లను పెంచాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రత్మకమైన సామాజిక కులగణన  సర్వే చేపట్టిందని తెలిపారు.

 బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేష్లను 42 శాతానికి పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశంలో చారిత్రత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. కులగణన సామాజిక సర్వేలో ఎస్సీల జనాభా 15 నుంచి 18 శాతం వరకు పెరిగిందని, దాని ప్రకారం ప్రకారం ప్రభుత్వం  రిజర్వేషన్లను18 శాతానికి పెంచి ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కును కాపాడాలని కోరారు.