అంబర్ పేటలో స్కూల్ వ్యాన్ బీభత్సం.. రెండు దుకాణాలు ధ్వంసం

అంబర్ పేటలో స్కూల్ వ్యాన్  బీభత్సం.. రెండు దుకాణాలు ధ్వంసం

హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఓ  ప్రైవేట్ స్కూల్ వ్యాన్  బీభత్సం సృష్టించింది. 2024, జూన్ 18వ తేదీ మంగళవారం తిలక్ నగర్ లో స్కూల్ వ్యాన్ అదుపుతప్పి.. రోడ్డు ప్రక్కనున్న రెండు దుకాణాల్లో(వెల్డింగ్ షాప్,  టీ స్టాల్)కి దూసుకెళ్లింది. దీంతో  షాపుల్లోని సామాగ్రి ద్వంసమైంది. స్కూల్ వ్యాన్ ముందు భాగం కూడా ధ్వంసమైంది. అయితే.. ప్రమాద సమయంలో వ్యాన్ లో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

రోడ్డు ప్రక్కనే ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని స్కూల్ వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా,  డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు