
హైదరాబాద్ : విద్యపైన సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా విద్యా అందిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలు మూసివేస్తామనడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. 12,440 పాఠశాలలు మూసివేస్తే.. గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతారని తెలిపారు. విద్యపైన పెట్టె వ్యయాన్ని పెట్టుబడిలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే విద్య దెబ్బతిన్నదని.. తెలంగాణ వచ్చాక ఒక్క ఉపాద్యాయూనికి పదోన్నతి ఇవ్వలేదన్నారు.
ఒక కొత్త టీచేరును నియమించలేదని… వ్యవస్తను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. 12 వేల బడులు మూసివేస్తే 36వేల మంది ఉపాధ్యాయులకు ఉపాధి పోతుందన్న ఆయన.. దేశంలో విద్య హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్లు దూరంలో ఒక్క పాఠశాల ఉండాలన్నారు. కానీ కేసీఆర్ 5 కి.మె దూరంలో పాటశాలను ఏర్పాటు చేస్తే 6 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బదులు వస్తాయని చెప్పారు. తెలంగాణ వస్తే విద్య బాగుపడుతదనుకుంటే స్కూళ్లను విలీనం చేసి నాశనం చేస్తున్నారని సీరియస్ అయ్యారు హర్షవర్ధన్ రెడ్డి.