జూన్ 15 (ఇయ్యాల్టి) నుంచే స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్ ..రాజ్ భవన్ స్కూల్లో ప్రారంభించనున్న పొన్నం

జూన్ 15 (ఇయ్యాల్టి) నుంచే స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్ ..రాజ్ భవన్ స్కూల్లో   ప్రారంభించనున్న పొన్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు: సోమవారం నుంచి ప్రభుత్వ స్కూల్స్ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బ్రేక్​ఫాస్ట్​స్కీం కూడా షురూ కానున్నది. మొదటి దశలో భాగంగా 45 ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ..రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 

మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ స్కీం లో భాగంగా 12,437 విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రోజూ ఒక టిఫిన్​చొప్పున మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, మిక్సుడ్​వెజ్ కుర్మాతో పూరీ, చట్నీతో బోండా, ఉప్మా చట్నీ, దోశ పెట్టబోతున్నట్టు చెప్పారు. 672 ప్రభుత్వ స్కూల్స్​లో బుక్స్​, నోట్ బుక్స్​ ఇవ్వనున్నట్టు తెలిపారు.