24 రోజుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్

24 రోజుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్
  •  ఫస్ట్‌ డే 40 శాతం లోపే అటెండెన్స్‌

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి, థర్డ్​వేవ్​తో ​సెలవుల పొడిగింపు తర్వాత 24 రోజుల అనంతరం సిటీలో మంగళవారం నుంచి విద్యాసంస్థలు రీ ఓపెన్ ​అయ్యాయి. ఫస్ట్​డే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అటెండెన్స్10 నుంచి 40 శాతంలోపే నమోదైంది. మరోవైపు కరోనా టెన్షన్​తో పాటు అమావాస్య సెంటిమెం ట్ తో డైరెక్ట్ క్లాసులకు పంపేందుకు పేరెంట్స్ ఇంట్రెస్ట్​ చూపలేదు. సర్కారు బడులన్నీ  తెరిచినా,  ప్రైవేట్ లో దాదాపు 60 శాతం స్కూళ్లను ఓపెన్​చేయలేదు. ఆన్​ లైన్​క్లాసులు కూడా కంటిన్యూ అయ్యాయి. 

స్కూల్ ఉంటుందో లేదోననే..

స్కూళ్ల రీ ఓపెన్ పై విద్యాశాఖ కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులు ఇచ్చినా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఫేక్ న్యూస్ కారణంగా 
మంగళవారం స్కూల్ ఉంటుందో లేదోననే డైలమాలో చాలామంది పేరెంట్స్ పిల్లలను బడులకు పంపలేదు. కొవిడ్​గైడ్ లైన్స్ పాటిస్తూ శానిటైజేషన్, క్లీనింగ్, ఫిజికల్​ డిస్టెన్స్ రూల్స్ పాటించినా పిల్లలు ఎక్కువగా రాలేదని పలువురు హెచ్​ఎంలు చెప్పారు. బెంచీకి ఇద్దరిని కూర్చొబెట్టి జాగ్రత్తలు పాటించేలా చూశామన్నారు. ఫస్ట్​డే స్టూడెంట్స్ అటెండెన్స్ తక్కువగా ఉందని, నాలుగైదురోజులయ్యాక సంఖ్య పెరగొచ్చని తెలిపారు. 

తెరుచుకోని సగం ప్రైవేట్ స్కూళ్లు

బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు 50 శాతం తెరుచుకోగా, మొత్తం 20 శాతం అటెండెన్సే నమోదైంది. సీబీఎస్‌‌ఈ, ఐఎస్‌‌ఈ స్కూల్స్ ఓపెన్ చేయలేదు. 60శాతం ప్రైవేట్ స్కూళ్లు ఆన్​లైన్​క్లాసులను కొనసాగించాయి. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో 20 నుంచి 40శాతం స్టూడెంట్స్ హాజరుకాగా, ఏడు లోపు తరగతుల్లో, ప్రీ ప్రైమరీ లో 10 నుంచి 18, 20శాతమే అటెండ్ అయ్యారు.  అటెండెన్స్​పెరిగేందుకు 
వారం పట్టొచ్చని మేకలమండి ప్రభుత్వ స్కూల్​ హెడ్​మాస్టర్​మల్లికార్జున్  తెలిపారు. ఫిజికల్ గా క్లాసులకు పంపిస్తామని పేరెంట్స్ చెప్పారని,  రీ ఓపెన్ రోజున అటెండెన్స్ 20 నుంచి 30శాతం లోపే నమోదైందని ఉప్పల్​లోని రవీంద్రభారతి స్కూల్​ ప్రిన్సిపల్ వీరయ్య  చెప్పారు.