
జీవన్మృతుడైన ఓ వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని డాక్టర్లు అమర్చిన సంఘటన అమెరికాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బ్రెయిన్‌డెడ్ అయిన 57 ఏళ్ల వ్యక్తి శరీరంలో కుటుంబసభ్యుల అనుమతితో జులై 14న పంది కిడ్నీ అమర్చారు.
ఈ ప్రయోగం విజయం కావడంతో రెండో రోజు నుంచి మూత్రం విడుదలవుతోంది. నెల రోజులుగా ఆ అవయవం బాగా పని చేస్తుండటంతో వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి పనే చేయగా పంది కిడ్నీ రెండు రోజులకు మించి పని చేయలేదని, ఇప్పుడు ఏకంగా నెల రోజులుగా పని చేయడం మిరాకిల్ అంటున్నారు న్యూయార్క్ వర్సిటీకి చెందిన ట్రాన్స్ప్లాంట్ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్మాంట్గోమెరి.
మనుషులకు జంతువుల అవయవాలు అమర్చడంలో ఇదో కీలక ముందడుగని వివరించారు. గతేడాది మేరీలాండ్ వర్సిటీ వైద్యులు జన్యుమార్పిడి చేసి పంది గుండెను ఓ వ్యక్తికి అమర్చి చరిత్ర సృష్టించినా.. ఆ వ్యక్తి రెండు నెలలు మాత్రమే బతికాడు.