హైదరాబాద్, వెలుగు: టెండర్లు, కాంట్రాక్టుల్లో విజిలెన్స్ పై దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో సదస్సు నిర్వహించింది. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ అండ్ సెక్రటరీ టు జనరల్ మేనేజర్, రైల్వే బోర్డు మాజీ డైరెక్టర్ మల్లాది శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆశిష్ మల్హోత్రా, ఇతర సీనియర్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ అధికారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన విచక్షణను ఉపయోగించాలని ఆయన సూచించారు.
