అలర్ట్: తెలంగాణలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు 

అలర్ట్: తెలంగాణలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు 

తెలంగాణలో డెంగ్యూతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని చిన్నా,పెద్దా అంతా అలర్ట్ గా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. గతంతో పోల్చుకుంటే డెంగ్యూ, మలేరియా కేసులు రాష్ట్రంలో తక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. అంతేకాదు..వ్యాధులతో సంభవించే మరణాల రేటు కూడా చాలా తగ్గిపోయిందన్నారు.

వర్షాలు పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. తాగు నీరు, ఆహారం కలుషితంతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయన్నారు. మూడు నెలల నుండి గ్రామీణ, పట్టణ ప్రాతాల్లోని వాటర్ నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమలు వృద్ది చెందకుండా జాగ్రతలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్ మస్కిటో నెట్స్, రాపిడ్ డయగ్నస్టిక్ టెస్ట్ కిట్ లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.