సాయి పారెంటరల్స్‌‌ ఐపీఓకి సెబీ ఓకే

సాయి పారెంటరల్స్‌‌ ఐపీఓకి సెబీ ఓకే

హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీ  సాయి పారెంటరల్స్ లిమిటెడ్ ఐపీఓకి  సెబీ ఆమోదం తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూలో  రూ.285 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్ల జారీతో పాటు,  35 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌) ఉంటుంది. మొత్తంగా కంపెనీ ఐపీఓ సైజ్‌‌ సుమారు రూ.425 కోట్ల వరకు ఉంటుంది.  ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌ను  బిజినెస్‌‌ విస్తరణకు,  తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి,  సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. 

మార్కెట్ పరిస్థితులు, ఇతర అనుమతుల ఆధారంగా ఐపీఓ ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభమవుతుంది. కంపెనీ షేర్లు బీఎస్‌‌ఈ, ఎన్‌‌ఎస్‌‌ఈలో లిస్టవుతాయి.  సాయి పారెంటరల్స్ లిమిటెడ్ బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్స్, కాంట్రాక్ట్ డెవలప్‌‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంఓ) సెగ్మెంట్లలో బిజినెస్ చేస్తోంది.  

ఇంజెక్టబుల్స్, ఓరల్ సాలిడ్స్, లిక్విడ్స్, టాపికల్ ఫార్ములేషన్స్ వంటి వివిధ ప్రొడక్ట్‌‌లను తయారు చేస్తోంది.  సంస్థకు భారతదేశంలో ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి.