భుజంగరావు, తిరుపతన్నలను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు

భుజంగరావు, తిరుపతన్నలను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్  కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నను రెండో రోజు(మార్చి 30) కస్టడీలో విచారణ చేస్తున్నారు పోలీసులు. నిన్న(మార్చి 29) చంచల్ జైల్లో నుంచి కస్టడీలొకి తీసుకున్న పోలీసులు... బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. నిన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి విచారించారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు అక్రమ వసూళ్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతలు, రియలర్టర్స్, జువెలరీ, హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టాస్క్ఫోర్స్ వెహికిల్స్ లో అప్పటి అధికార పార్టీకి చెందిన డబ్బులు తరలించినట్లు గుర్తించారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధకిషన్ రావుల టీమ్ మెంబర్స్ ని విచారిస్తున్నారు. ఇప్పటికే 30 మంది పోలీసులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.