గంజాయి కావాలా.?.. డెలివరీ బాయ్ మెసేజ్

గంజాయి కావాలా.?.. డెలివరీ బాయ్ మెసేజ్

దేశంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరుగుతోంది. డ్రగ్స్ దందాకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు హోటళ్లు, పబ్ లు, బార్లు రెస్టారెంట్ లు, క్లబ్ లలో డ్రగ్స్ దందాను సరఫరా చేస్తుంటే మరి కొందరు స్మార్ట్ గా ఈజీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. లేటెస్ట్ గా ఓ జొమాటో డెలివరీ బాయ్ డ్రగ్స్ కావాలా అంటూ  కస్టమర్ తో చాటింగ్ చేసిన  స్క్రీన్ శాట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. 

అర్థరాత్రి 2.30 గంటలకు ఫుడ్ ఆర్డర్  చేసిన ఓ కస్టమర్ కు  డెలివరీ బాయ్ ఈ విధంగా చాట్ చేశాడు.  నేను ఫుడ్ పార్సిల్ తీసుకుని రెడీగా ఉన్నా..మీకు ఫుడ్ తో పాటు ఇంకా వేరే ఏదైనా కావాలా( ఖుచ్ చాహియే అప్ కో) అని మెసేజ్ పెట్టాడు.  తర్వాత కస్టమర్ కు సిగరెట్, గంజాయి అవసరమా అని హిందీలో మెసేజ్ చేశాడు.

డెలివరీ బాయ్ చేసిన ఈ స్క్రీన్ శాట్స్ ను తన కస్టమర్ రూమ్ మేట్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో  వైరల్ గా మారాయి. అయితే ఆ డెలివరీ బాయ్ ఎవరు.? ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. 

అర్థరాత్రి 2.30 గంటలకు ఫుడ్ ఆర్డర్  చేసిన ఓ కస్టమర్ కు  డెలివరీ బాయ్ ఈ విధంగా చాట్ చేశాడు.  నేను ఫుడ్ పార్సిల్ తీసుకుని రెడీగా ఉన్నా..మీకు ఫుడ్ తో పాటు ఇంకా వేరే ఏదైనా కావాలా( ఖుచ్ చాహియే అప్ కో) అని మెసేజ్ పెట్టాడు.