భైంసాలో 144 సెక్షన్ సడలింపు.. రోడ్లపైకి జనాలు

భైంసాలో 144 సెక్షన్ సడలింపు.. రోడ్లపైకి జనాలు

నిర్మల్ జిల్లా బైంసాలో 144 సెక్షన్ నుంచి కొంత ఉపశమనం కలిగించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కర్ఫ్యూలో కొంత సడలింపు ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు రావొచ్చని పోలీసులు తెలిపారు. దాంతో జనాలు సరుకుల కోసం రోడ్లపైకి వచ్చారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా కొన్ని రూట్లలో బస్సులు నడుపుతుంది. భైంసా అలర్లకు సంబంధించి ఇప్పటివరకు 29 కేసులు నమోదు చేసి.. 96 మందిని స్థానిక ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇంటర్నెట్ విషయంలో మాత్రం సడలింపులు ఇవ్వలేదు. ఇప్పటికీ ఇంటర్నెట్ సేవల బంద్ కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా.. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు కాస్తున్నారు. అయితే ఈ అల్లర్లకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతూనే ఉన్నారు.