బీజేపీతోనే అందరికీ న్యాయం

బీజేపీతోనే అందరికీ న్యాయం

ముషీరాబాద్, వెలుగు : అన్ని వర్గాలకు అండగా ఉండేది బీజేపీ మాత్రమేనని సికింద్రాబాద్​బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి అన్నారు. గురువారం రాత్రి నారాయణగూడ కేశవ్ మెమోరియల్ హాల్ లో సికింద్రాబాద్ లోక్​సభ స్థానం పరిధిలోని ఎస్సీ మాలల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ప్రధాన నరేంద్ర మోదీ అన్ని వర్గాల దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను ఢిల్లీకి పంపాలని కోరారు.