స్కూల్ బస్సు ఢీకొని ఆయా మృతి

స్కూల్ బస్సు ఢీకొని ఆయా మృతి

సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్ పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పల్లివి మోడల్ స్కూల్ లో ఆయాగా పనిచేస్తున్న జ్యోతి(42) అనే మహిళను అదే స్కూల్ కు చెందిన బస్సు ఢీకొట్టింది. పాఠశాల మైదానంలో నుంచి బస్సును బయటకు తీస్తున్న క్రమంలో బస్సు మహిళను ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

దీంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.