
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ (Ministry of defence). ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డులకు కేంద్రం ఎన్నికలకు నిర్వహణకు గాను నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తొలుత ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎనిమిది వార్డులున్నాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరిగాయి. 2020 ఫిబ్రవరిలో కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో కేంద్రం నామినేటేడ్ సభ్యుడిని నియమించింది. కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా, రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.