కనులవిందుగా పతంగుల పండుగ.. పరేడ్ గ్రౌండ్స్లో గ్రాండ్ గా నిర్వహించిన ప్రభుత్వం

కనులవిందుగా  పతంగుల పండుగ.. పరేడ్ గ్రౌండ్స్లో గ్రాండ్ గా నిర్వహించిన ప్రభుత్వం

సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్స్​లో జాతీయ స్థాయి  పతంగుల పండుగను తెలంగాణ ప్రభుత్వం గ్రాండ్​గా నిర్వహించింది. టూరిస్ట్​ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న కైట్​ ఫెస్టివల్​ను మంగళవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం  ప్రభాకర్​ ప్రారంభించారు. తీరొక్క పతంగులతో పరేడ్​ గ్రౌండ్ ​కలర్​ఫుల్​గా కనిపించింది. వివిధ ఆకారాలతో ఏర్పాటు చేసిన భారీ పతంగులు కనువిందు చేశాయి. 

ఈ పండుగలో పలు  రాష్ట్రాలతో పాటు ఫారెనర్స్​ కూడా పాల్గొని విభిన్నమైన పతంగులను ప్రదర్శించారు. మరోవైపు జూబ్లీహిల్స్​లోని రౌనక్ ఎస్టేట్‌లో ఆసఫ్‌జాహీ వంశానికి చెందిన 9వ నిజాం, నిజాం ఎస్టేట్స్​ కస్టోడియన్ హిస్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ ఆద్వర్యంలో భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. శిల్పారామంలో గంగిరెద్దులు, హరిదాసుల ప్రదర్శన ఆకట్టుకుంది.