సరదా కోసం వెళ్లి బండరాళ్లలో ఇరుక్కున్నాడు

సరదా కోసం వెళ్లి బండరాళ్లలో ఇరుక్కున్నాడు

సరదా కోసం పెద్ద బండరాళ్లపైకి ఎక్కిన ఓ యువకుడు అదుపు తప్పి రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రాజు అనే యువకుడు బ్రతుకుదేరువు కోసం నగరానికి వచ్చాడు. అయితే నిన్న సాయంత్రం సరదా తిరుమలగిరి కెన్ కాలేజ్ సమీపంలో కాలిప్రదేశంలో ఉన్న బండరాళ్ల పైకి ఎక్కాడు. ఈ క్రమంలో రాజు పట్టుతప్పి రెండు మధ్యలో పడిపోయి ఇరుక్కుపోయాడు. బయటకు రాలేని పరిస్థితిలో అరుపులు, కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద మూడు గంటలు శ్రేమించి యువకున్ని బయటకు తీసినట్లు సిఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రథమ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, అక్కడ ట్రీట్మెంట్ అనంతరం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి మహారాష్ట్రకు వెళుతానని రాజు అనడంతో అతన్ని పంపినట్లు సిఐ తెలిపారు. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడిని సేఫ్ గా బయటకు తీసిన రాంబాబు,బాషా, రాజు అనే కాస్టేబుల్స్ ను సిఐ శ్రవణ్ కుమార్ అభినందించారు.