సభాస్థలి వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సీపీ 

సభాస్థలి వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సీపీ 

పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మోడీ బహిరంగ సభ కోసం సర్వం సిద్ధమైంది. సభ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లోపల 150 సీసీ కెమెరాలతో అణువణువూ నిఘా పెట్టారు. ప్రధాని మోడీ సహా ముఖ్య అతిధులు గ్రౌండ్లోకి వెళ్లే ప్రధాన రహదారిని బారికేడ్లతో మూసేశారు. మరోవైపు చినుకులు పడుతున్నప్పటికీ జిల్లాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు సభకు తరలి వస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలకు అనుమతిస్తున్నారు.

ఇదిలా ఉంటే మోడీ సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు వెళ్లే దారుల్లో వాహనాల రాకపోకలు నిలిపేశారు. దారి పొడవునా వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, బేగంపేట్, రసూల్ పరురా ఏరియాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అటు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.