బాద్ షా ‘పఠాన్’ రిలీజ్ డేట్ కన్ఫామ్

బాద్ షా ‘పఠాన్’ రిలీజ్ డేట్ కన్ఫామ్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌‌ను చాలా రోజుల తర్వాత వెండి తెరపై చూడబోతున్నారు. ఆయన చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఎదురు చూసిన అభిమానులకు సర్ ఫ్రైజ్ న్యూస్ వచ్చింది. షారుఖ్ న్యూ ఫిల్మ్ ‘పఠాన్’ రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. ఈ మేరకు షారుఖ్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. 2023, జనవరి 25న కలుద్దాం అంటూ ఆయన క్యాప్షన్ జత చేశారు. పెద్ద స్క్రీన్ లో YRF 50తో పఠాన్ ను జరుపుకోవాలని సూచించారు. హిందీ, తమిళం, తెలుగులో ఈ సినిమా విడుదలవుతోందని చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆయన చేసిన ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. రైఫిల్ పట్టుకున్న ఫొటోను చూపించారు. షారుఖ్ నటించిన తొలి హిందీ చిత్రం ‘దీవానా’ విడుదలై ఇవాళ్టితో 30 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ‘పఠాన్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పఠాన్ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా..సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక షారుఖ్ పక్కన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ పాత్రలో అలరించనున్నారని సమాచారం. జాన్ అబ్రహం ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇక షారుఖ్ విషయానికి వస్తే.. వెండి తెరకు ఇతను చాలానే గ్యాప్ ఇచ్చాడని చెప్పవచ్చు. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమా చేయాలని అనుకున్నా.. వివిధ కారణాల వల్ల వీలు కాలేదు. అనంతరం ఏకంగా వివిధ సినిమాలకు ఓకే చెప్పేశారు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ఫిల్మ్ లో షారుఖ్ డ్యూయల్ రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణీతో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. అంతేగాకుండా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలో షారుఖ్ గెస్ట్ రోల్ చేయనున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షారుఖ్ ఫుల్ బిజీగా మారిపోయారు.