హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం నేపథ్యంలో తలెత్తుతున్న అంశాలపై మంత్రి సీతక్క జార్ఖండ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా వీబీజీ రామ్‌జీ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, కార్మికులు, ఉపాధి హామీ పథకంపై ఆధారపడిన కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఈ పథకం వల్ల నష్టపోయే అవకాశం ఉన్న వర్గాల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ పథకంలోని పలు నిబంధనలపై రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలను సమగ్రంగా సేకరించి కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించారు.
