డ్రగ్స్‌‌‌‌ కేసులో రోహిత్‌‌‌‌ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లే? : మంత్రి సీతక్క

డ్రగ్స్‌‌‌‌ కేసులో రోహిత్‌‌‌‌ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లే? : మంత్రి సీతక్క
  •     కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు మంత్రి సీతక్క ప్రశ్న
  •     ఏపీలో టీడీపీ ఎంపీని పార్టీకి దూరంగా ఉండాలని నోటీసులిచ్చారంటూ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎవరూ గుర్తించకపోవడంతో రాహుల్ గాంధీని నిందించడాన్ని అలవాటుగా మార్చుకున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. ఆయనను తిడితే పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భావిస్తున్నారన్నారు. రాహుల్ గురించి కాకుండా ముందు మీ పార్టీ నేతల డ్రగ్స్ దందా గురించి మాట్లాడాలని హితవు పలికారు. మీ వారసత్వాన్ని మీ నేతలు ఫాంహౌస్‌‌‌‌లో కొనసాగిస్తారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్‌‌‌‌ను ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థం అవుతుందన్నారు. 

పక్క రాష్ట్రం టీడీపీ ఎంపీ దొరికితే ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలిచ్చారని, మీరు ఎందుకు మీ నాయకుడు రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్ చాట్ చేశారు. “మా ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా కేటీఆర్ ఓర్వడం లేదు. అప్పులు, వడ్డీలు కడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. స్కీమ్‌‌‌‌ల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం”అని అన్నారు. బీజేపీ వైఫల్యాల మీద మాట్లాడాలంటే భయపడుతున్న కేటీఆర్‌‌‌‌.. మా నాయకుడు రాహుల్ గాంధీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.