సేహ్వాగ్ దూకుడు తగ్గలేదు

సేహ్వాగ్  దూకుడు తగ్గలేదు

ముంబై: ప్రొఫెషనల్‌‌ కెరీర్‌‌కు వీడ్కోలు పలికినా.. వయసు నలభై దాటినా ఇండియా లెజెండరీ క్రికెటర్‌‌ వీరేందర్‌‌ సెహ్వాగ్‌‌ ఆటలో వన్నె తగ్గలేదు. రోడ్‌‌ సేఫ్టీ వరల్డ్‌‌ సిరీస్‌‌లో భాగంగా ముంబైలో వెస్టిండీస్‌‌ లెజెండ్స్‌‌, ఇండియా లెజెండ్స్‌‌ మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్‌‌లో సెహ్వాగ్​తో పాటు అలనాటి ఆటగాళ్లు అదరగొట్టారు. సెహ్వాగ్‌‌ (57 బంతుల్లో 11 ఫోర్లతో 74 నాటౌ ట్‌‌) మెరుపు హాఫ్‌‌ సెంచరీకి తోడు కెప్టెన్‌‌ సచిన్‌‌ (36) రాణించడంతో ఇండియా 7 వికెట్ల తేడాతో విండీస్‌‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌‌ చేసిన విండీస్‌‌ లెజెండ్స్‌‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 రన్స్‌‌ చేసింది.  చందర్‌‌పాల్‌‌(61), డారెంగ్‌‌ గంగా (32) సత్తా చాటారు. ఇండియా బౌలర్లలో జహీర్‌‌ ఖాన్‌‌, మునాఫ్‌‌ పటేల్‌‌, ప్రజ్ఞాన్‌‌ ఓఝా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ సెహ్వాగ్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో ఇండియా 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఈజీగా గెలిచింది. రోడ్డు భద్రత అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ సిరీస్‌‌లో శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లెజెండ్స్‌‌ జట్లు కూడా పోటీ పడుతున్నాయి.