ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని వేల సినిమాలను హార్డ్ డిస్క్ల్లో ఇమ్మడి రవి భద్రపరిచినట్లు తెలిసింది. డిలీట్ అయినా సరే బ్యాకప్లో వేల సినిమాలను హార్ట్ డిస్క్లలో రవి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇమ్మడి రవి స్వస్థలం వైజాగ్. ముంబైలో MBA పూర్తి చేశాడు. ఇమ్మడి రవిది ప్రేమ వివాహం. కొన్ని రోజుల తర్వాత.. రవి, అతని భార్య విడిపోయారు. రెయిన్ బో విస్టాలో గత 2018 నుంచి ఇమ్మడి రవి నివాసం ఉంటున్నాడు. మొదట్లో ఫ్యామిలీతో ఉన్న రవి తరువాత ఒక్కడే రెయిన్ బో విస్టాలో ఉంటున్నాడు. 

కమ్యూనిటీ వాసులు అడిగితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని రవి చెప్పాడు. అయితే.. రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలలో CEOగా ఉన్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. Getting up, ER Infotech అనే రెండు కంపెనీలకు రవి సీఈఓగా ఉన్నాడు. రెయిన్ బో విస్టా నుంచి ఇతర దేశాలకు ఐపీ అడ్రస్ను మార్చుకుంటూ వెళ్లిన రవి.. యూకేలో ఏకంగా ఓ టీంనే నడిపిస్తు్న్నాడు. కొన్ని వేల సినిమాలను తన టీంతో కలిసి సర్వర్ల ద్వారా హ్యాక్ చేస్తున్న రవి.. గ్లోబల్లో పెద్ద నెట్వర్క్ను నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి, పోలీసులకు సవాలుగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని కూకట్​పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి విదేశాల్లో ఉంటూ పైరసీ తతంగాన్ని నడిపాడు. అందుకు స్థానికంగా ఉన్న కొద్దిమంది వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నాడు. ఇటీవల ఈ పైరసీకి సహకరిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.