సాఫ్ట్వేర్ సురేందర్ కిడ్నాప్ కేసులో సంచలన నిజాలు..

సాఫ్ట్వేర్ సురేందర్ కిడ్నాప్ కేసులో సంచలన నిజాలు..

హైదరాబాద్: రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితులను విచారించడంతో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరినే  ప్రధాని సూత్రధారి అని పోలీసులు తేల్చారు. జనవరి 4న సాయంత్రం కాజాగూడ చెరువు వద్ద తన చెల్లెలితో మాట్లాడుతుండగా సురేందర్ ను సురేష్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. సురేందర్ ను షిఫ్ట్ డిజైర్ కారులో  (TS05EG2778) కిడ్నాప్ చేసి నల్లమల ఫారెస్ట్ కు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

 కిడ్నాప్ కు గురైన సరేందర్ నల్లగొండ జిల్లా వాసి.. భార్య , కొడుకుతో పాటు కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. కాజాగూడ లేక్ దగ్గర సురేందర్ ను కిడ్నాప్ చేసిన నిందితులు అతని ముఖానికి మాస్క్ వేసి కారులో నంద్యాలకు తీసుకెళ్లారు. నంద్యాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఉండటంతో మాస్క్ తొలగించారు. సురేందర్ ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానించిన పోలీసులు కిడ్నాపర్లను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను నంద్యాల పోలీసులు పట్టుకున్నారు.. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. 

సైబరాబాద్ పోలీసులు, సురేందర్ కుటుంబ సభ్యులు  నంద్యాలకు వెళ్లి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పారిపోయిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. నురేందర్ సోదరి ఈ కిడ్నాప్  ప్రధాన సూత్రధారి అని అని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ కు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.