V6 News

మళ్లీ పడిన స్టాక్ మార్కెట్..ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మళ్లీ పడిన స్టాక్ మార్కెట్..ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అమెరికా స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల పతనం, అమెరికా- ఇరాన్ టెన్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో మన స్టాక్​ మార్కెట్లు మరోసారి భారీగా పడ్డాయి. ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ శుక్రవారం 961 పాయింట్లు తగ్గి 81,287 దగ్గర, నిఫ్టీ 318 పాయింట్ల నష్టంతో 25,179 దగ్గర ముగిశాయి. డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ 6 పైసలు తగ్గి 90.97 వద్ద సెటిలైంది. ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు)  నికరంగా రూ.3,466 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్నారు. అమెరికా మార్కెట్లు గురువారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడడంతో ఆ ఎఫెక్ట్  గ్లోబల్ మార్కెట్లపై కనిపించింది.

ముంబై: మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బేర్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లతో పాటే మన బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు కూడా  శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాస్ వచ్చింది.   అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం,  అమెరికా– ఇరాన్ టెన్షన్స్‌‌‌‌‌‌‌‌ వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ శుక్రవారం 961 పాయింట్లు తగ్గి 81,287 దగ్గర, నిఫ్టీ 318 పాయింట్ల నష్టంతో 25,179 దగ్గర  ముగిశాయి.  బీఎస్‌‌‌‌‌‌‌‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.463 లక్షల కోట్లకు తగ్గింది. 

ఐటీ షేర్లు పెరిగినా, మెటల్‌‌, ఆటో, ఎఫ్‌‌ఎంసీజీ, రియల్టీ, టెలికమ్యూనికేషన్‌‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో షేర్లు ఎక్కువగా నష్టపోగా, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్‌‌‌‌‌‌‌‌, ట్రెంట్‌‌‌‌‌‌‌‌, ఎటర్నల్‌‌‌‌‌‌‌‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. డాలర్‌‌‌‌తో రూపాయి 17 పైసలు తగ్గి 91.08వద్ద సెటిలయ్యింది.

మార్కెట్ పతనానికి కారణాలు..

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల అమ్మకాలు..

ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) నికరల అమ్మకందారులుగా మారారు. గురువారం దాదాపు రూ.3,500 కోట్ల విలువైన షేర్లన అమ్మిన వీరు,  శుక్రవారం మరో రూ.7,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.  డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.12,200  కోట్ల విలువైన షేర్లను కొని, మార్కెట్‌‌కు సపోర్ట్‌‌గా నిలిచారు.

డల్‌‌గా గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్స్‌‌‌‌‌‌‌‌

అమెరికా మార్కెట్లు  గురువారం సెషన్‌‌‌‌‌‌‌‌లో పడడంతో ఈ ఎఫెక్ట్ శుక్రవారం గ్లోబల్ మార్కెట్లలో కనిపించింది. సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా కొస్పీ ఒక శాతం క్రాష్ అయ్యింది.  జపాన్స్ నిక్కీ 225,  హాంకాంగ్ హంగ్ సెంగ్‌‌‌‌‌‌‌‌, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ముగిశాయి.  యూఎస్‌‌ డౌజోన్స్‌‌ శుక్రవారం ఒక శాతం పడింది.

అమెరికా–ఇరాన్ టెన్షన్స్‌‌‌‌‌‌‌‌..

నూక్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌కి సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య గురువారం పరోక్షంగా చర్చలు జరిగాయి. కానీ, ఇరు దేశాల మధ్య ఎటువంటి డీల్ కుదరలేదు.  15 రోజుల్లో డీల్ కుదుర్చుకోకపోతే  పరిస్థితులు చాలా అధ్వాన్నంగా మారతాయని ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌‌‌‌‌‌‌‌కు వార్నింగ్ ఇచ్చారు.