స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్

స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్

ముంబై: బెంచ్‌‌మార్క్ బిఎస్‌‌ఇ సెన్సెక్స్  నిఫ్టీ తమ రెండు రోజుల నష్టాలకు బ్రేకేసింది. మంగళవారం దాదాపు అర శాతం ఎగబాకింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు పెరిగాయి.  బిఎస్‌‌ఇ సెన్సెక్స్ 257.43 పాయింట్లు (0.44 శాతం) పెరిగి 59,031.30 వద్ద సెటిలయింది. ఇంట్రాడేలో ఇది గరిష్టంగా 59,199.11 స్థాయిని,  కనిష్ట స్థాయి 58,172.48ని తాకింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 86.80 పాయింట్లు (0.50 శాతం) పెరిగి 17,577.50 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌‌సర్వ్, టైటాన్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా  ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌‌సిఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, విప్రో  హెచ్‌‌డిఎఫ్‌‌సి బ్యాంక్ వెనుకబడ్డాయి. సియోల్, టోక్యో, షాంఘై  హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  

వాల్ స్ట్రీట్ సోమవారం బాగా నష్టాల్లో ముగిసింది.  యూరోపియన్ దేశాల్లో పెట్రో ధరల పెరగడం  రేట్ల పెంపు భయాలతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీయంగా, బ్యాంకులు, ఆటోలు, మెటల్, ఐటీ స్టాక్‌‌లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మార్జిన్ల ఒత్తిడి కారణంగా ఐటీ మేజర్లు వేరియబుల్ పేలని తగ్గించారని నాయర్ విరించారు. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ చమురు బెంచ్​మార్క్​ బ్రెంట్ క్రూడ్ 1.43 శాతం పెరిగి బ్యారెల్​కు 97.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫారిన్​ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) సోమవారం రూ. 453.77 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.