హైదరాబాద్​లో కొత్త స్విప్ట్ ను లాంచ్​ చేసిన శ్రీ సత్య

హైదరాబాద్​లో కొత్త స్విప్ట్ ను లాంచ్​ చేసిన శ్రీ సత్య

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎపిక్ న్యూ స్విప్ట్ కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్‌‌లో  మారుతి సుజుకీ వి డుదల చేసింది. నగరంలోని ఎల్.బి.నగర్​లో గల  మారుతి సుజుకీ ఎరినా కళ్యాణి మోటార్స్ లో ఈ  కారును  టాలీవుడ్  నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించారు.  

సత్యతో పాటు  మారుతీ సుజుకీ టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం సూర్య, కళ్యాణి మోటార్స్  సీఈఓ వేంకటేశ్వరరావు,  బ్రాంచీ ఏజీయం రాజ్ కుమార్,   తదితరులు కలిసి  మొదటి 5 మంది వినియోగదారులకు  కార్లను డెలివరీ చేశారు.

ఇప్పటి వరకు వందకు పైగా  బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదయ్యాయని  కళ్యాణి మోటార్స్ సీఈ ఓ వేంకటేశ్వరరావు పేర్కొన్నారు.  ఎపిక్ న్యూ స్విఫ్ట్  హ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్ లీటరకు 25.75 కి.మీ మైలేజ్ ఇస్తోంది.