వాస్తు అంటే నివాస గృహం (ఇల్లు) లేదా ప్రదేశం అని శబ్దార్థం. వాస్తు శాస్త్రం అంటే... ఇంటి నిర్మాణాల్లో విధివిధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. ఇందుకు సంబంధించి ఎలాంటి దోషాలకైనా నిష్పత్తి మార్గాలు ఉంటాయి. బాత్రూం కమోడ్ ఎలా ఉండాలి.. బాత్రూం నిర్మాణంలో తీసుకోవలసిన వాస్తు సిద్దాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. . !
ప్రశ్న: మా ఇంట్లో రెండు బాత్రూములున్నాయి. రెండిట్లోనూ కమోడ్ కుండీలు నైరుతి మూలన ఉన్నాయి. అవి కట్టేటప్పుడు ఆ మూల వద్దని ఎంతమంది చెప్పినా నేను వినలేదు. ఆ మూలన ఉండటంవల్లే ఇప్పుడు మాకు ఆర్థిక ఇబ్బందులు వస్తు న్నాయని కొందరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం. అసలు బాత్రూమ్ కమోడ్ ఏ మూలన ఉండాలి? వాటిపై కూర్చున్నప్పుడు ముఖం ఏవైపు చూడాలి? ప్రస్తుతం నేను అప్పులతో సతమతమవు తున్నాను. దీనికి పరిష్కారం చెప్పండి.
జవాబు: బాత్రూముల్లో కమోడ్ల మీద కూర్చున్నప్పుడు మనిషి ముఖం దక్షిణం లేదా ఉత్తరం దిక్కును చూస్తూ ఉండాలి. ఒంటికి లేదా రెంటికి వెళ్లి నప్పుడు తూర్పు, పడమర దిక్కుల వైపు చూసేలా ఉండకూడదు. ఎందుకంటే సూర్య భగవానుడు ఆ దిక్కులో ఉంటాడు. వీలైతే కమోడ్ను ఆగ్నేయ, వాయువ్య మూలలకు మార్చుకోవాలి. ఇందులో ముఖ్య విషయం ఎంటంటే బాత్రూమ్ డోర్ నైరుతి మూలకు ఉండకూడదు. బాత్రూముల్లో పడి చనిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే బాత్రూమ్ కట్టేటప్పుడు వాస్తు చూపించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.
వెలుగు లైఫ్
