జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా(NREGA) నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సమీపంలో ఇండియా కూటమి ఎంపీల భారీ ర్యాలీ నిర్వహించారు. నరారేనుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నరేగాలో గాంధీని చేర్చాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా పార్లమెంటులో నిరసనలు తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలు గురువారం (డిసెంబర్18) పార్లమెంటు సమీపంలో ర్యాలీ చేపట్టారు.
ఇండియా కూటమి ర్యాలీ లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీ చరిత్రను చెరిపే కుట్ర చేస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టంలో మార్పులతో గ్రామీణ పేదలకు ఉపాధి కష్టమవతుందన్నారు.
