ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది వైసీపీ. గురువారం ( డిసెంబర్ 18 ) వైసీపీ నేతల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే పెద్ద స్కాం అని.. తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని అన్నారు జగన్.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుందని.. కోటి 4 లక్షల మందికి పైగా ప్రజలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారని అన్నారు జగన్. కోటి సంతకాల సేకరణతో కోర్టు తలుపులు కూడా తడతామని అన్నారు. కోటి సంతకాల ద్వారా కోర్టులో అఫిడవిట్ వేస్తామని అన్నారు జగన్.
తమ పార్టీ అధికారంలోకి రాగానే పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని.. ఈ స్కాంకు పాల్పడ్డ వారెవ్వరిని వదిలిపెట్టమని అన్నారు జగన్. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతామని అన్నారు. చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నామని అన్నారు.
గవర్నర్ 40 మందికి అనుమతిచ్చారని.. లోక్ భవన్ కు వెళ్లేముందు అంబేద్కర్ విగ్రాహం వరకు అందరం వెళ్లి.. అక్కడి నుంచి 40 మందితో గవర్నర్ ను కలుస్తామని అన్నారు జగన్.ఆ తర్వాత కోర్టు తలుపులు తడతామని.. చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు జగన్.
