ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి మహిళా ఖైదీ పరార్ అయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పరారైన ఖైదీని షబానా బేగంగా పోలీసులు గుర్తించారు. రిమ్స్ అసుపత్రికి చికిత్స కోసం తరలించిన సమయంలో ఈ మహిళా ఖైదీ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం కేసులో షబానా బేగం అరెస్ట్ అయి జైలుకు వెళ్లింది.
ఈ మహిళా ఖైదీ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి తప్పించుకుని బాసరలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ఆదిలాబాద్ పోలీసులు బాసర వెళ్లారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన ఘటనలు చాలా అరుదు. ఆదిలాబాద్లో ఈ ఘటన జరగడంతో స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
ALSO READ : హైదరాబాద్లో వైద్యం కోసం క్లినిక్లకు వెళుతున్నారా..?
ఇదిలా ఉండగా.. జైలుకు వచ్చే ప్రతి ఖైదీని నిబంధనల ప్రకారం.. ఆరోగ్య పరీక్షలు చేయించిన తర్వాతే జైళ్లలోకి పంపుతారు. ఇలా హెల్త్ స్క్రీనింగ్‌లో గుర్తించిన జబ్బుల ఆధారంగా వారికి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ఈ మేరకు ప్రతి అండర్ ట్రయల్ ఖైదీ సహా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి పటిష్టమైన హెల్త్ రికార్డులను అధికారులు రూపొందించారు.
ALSO READ : వందేండ్ల గండిపేట్ కాలువకు లీకులు..
17 మంది గర్భిణి ఖైదీలకు జైళ్ల శాఖ విజయంతంగా ఆపరేషన్లు చేయించింది. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఈమేరకు సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లలో ప్రత్యేకంగా డాక్టర్లను నియమించారు. గుండె ఆపరేషన్లకు అవసరమైన మెడిసిన్స్ కోసం అధికారులు గతేడాది రూ.11.59 లక్షలు ఖర్చు చేశారు. మహిళా జైళ్లలో గర్భంతో ఉన్న ఖైదీల ఆరోగ్యం పట్ల జైళ్లశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
