కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ బుకింగ్స్ మొదటి రోజే (డిసెంబర్ 16) 70 వేలు దాటాయి. అదనంగా 1.35 లక్షల మంది తమ ఇష్టమైన కాన్ఫిగరేషన్లను సబ్మిట్ చేశారని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తెలిపింది. ఈ కారును బుక్ చేసుకోవడానికి రూ.21 వేలు చెల్లించాలి. టాటా సియోరా ఎస్‌యూవీ ధరలు రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉన్నాయి.
మూడు ఇంజిన్ ఆప్షన్లతో, ఏడు ట్రిమ్‌లలో ఈ బండి లభిస్తుంది. ఎల్‌ఈడీ లైటింగ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, జేబీఎల్ 12-స్పీకర్ సిస్టమ్, పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవెల్ 2+ ఏడీఏఎస్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంది. నాట్రాక్స్ టెస్టుల్లో లీటర్‌కు 29.9 కి.మీల మైలేజ్, గంటకు 222 కి.మీ టాప్ స్పీడ్ సాధించింది.
