
హైదరాబాద్, వెలుగు: మూడు, ఆరు తరగతుల పాఠ్యపుస్తకాలపై ఉన్న రాజ్యాంగ ప్రవేశికను తొలగించాలని ఎన్ సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి. నాగరాజు డిమాండ్ చేశారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించాలని ప్రవేశిక చెప్తుందన్నారు.
అయితే, ఈ ఏడాది పుస్తకాల్లో ప్రవేశికను క్రమంగా తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నూతన విద్యావిధానం తీసుకొస్తుండటంతో, ప్రస్తుతం ఎన్ సీఈఆర్టీ పుస్తకాలను సవరిస్తోందన్నారు. ఇలాంటి చర్యలను ఎన్సీఈఆర్టీ మానుకోవాలని సూచించారు.