హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో వాల్ పోస్టర్స్ అతికించే విషయంలో విద్యార్థులు గొడవపడ్డారు. గచ్చిబౌలి ఏబీవీపీ విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారు. దీందో కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
