షాదీ ముబారక్ స్కీం ను వాడుకుని 21 లక్షల రూపాయల స్కాం కు పాల్పడిన ముఠా గుట్టురట్టు చేశారు అత్తపూర్ పోలీసులు. నకిలీ పత్రాలు సృళష్టించి ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్న నిందితులను 2026 జూన్ 13న అరెస్టు చేశారు. ఈ స్కాంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కీలక సూత్రదారిగా నిర్ధారించిన పోలీసులు.. ఆయనతో పాటు మరో ఐదు మందిని అరెస్టు చేశారు.
ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ ఎతిమాద్, అతని అనుచరులు మొహమ్మద్ అక్బర్, ముషరఫ్, సర్ఫరాజ్, జాఫర్‌లు హసన్‌నగర్‌లోని ఫాతిమా కాలనీలో ఇంటిని తీసుకోని స్కాంకు స్కెచ్ వేశారు. షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకిలీ పత్రాలను తయారు చేసి అకౌంట్లలోక డబ్బు జమచేయించుకుంటున్నారు. నకిలీ పత్రాలను బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ప్రభుత్వ నిధులను అక్రమంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు షాదిముబారక్ స్కాం పై కన్నేసి ఉంచిన పోలీసులు.. ఎట్టకేలకు నిందిగు అందిందన్నారు. ఈ సమాచారాన్ని రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీకి తెలియజేఇ వారి నుంచి అనుమతి పొందిన అనంరతం పంచసాక్షులైన షేక్ ఇమ్రాన్, మొహమ్మద్ నసీర్‌లను హాజరుపరచి దాడి ఉద్దేశ్యాన్ని వివరించామన్నారు. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ఇంట్లోకి సబ్ ఇన్‌స్పెక్టర్ టి.జయరాజ్, ఇంతియాజ్, కిరణ్, అజ్మత్‌లు కలిసి దాడి చేసి శోధన చేశారన్నారు.
ఈ శోధనలో ఒక ల్యాప్‌టాప్, ఒక హెచ్‌పి సీపీయూ, ఒక ఫింగర్ కంపెనీ మానిటర్‌తో కూడిన డెస్క్‌టాప్ కంప్యూటర్, పలు మొబైల్ ఫోన్లు, షాదీముబారక్ పథకానికి సంబంధించిన నకిలీ ధరఖాస్తులు, ఇతర పత్రాలు లభ్యమైయ్యాయన్నారు. విడుదలైన 21 చెక్కులు(మొత్తం విలువ సుమారు రూ.21 లక్షలు ఉందన్నారు. వీరితో పాటు బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న దారవత్ అశోక్‌కుమార్(32)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
