
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఆదివారం ఇండియా చాంపియన్స్– పాకిస్తాన్ చాంపియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఈ మెగా మ్యాచ్ పోరుకు ఒక రోజు ముందు మ్యాచ్ నుండి వైదొలిగినందుకు భారత ఆటగాళ్లపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర విమర్శలు చేశాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఈ టీమిండియా మాజీ ఓపెనర్ ను అఫ్రిది కుళ్ళిన గుడ్డుతో పోల్చడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది.
అఫ్రిది మాట్లాడుతూ.. ఒక కుళ్ళిన గుడ్డు మొత్తం చెడగొడుతుందని అఫ్రిది పరోక్షంగా ధావన్ ను ఉద్దేశించి చెప్పినట్టు స్పష్టంగా తెలుస్తోంది."మేము క్రికెట్ ఆడటానికి ఇక్కడకు వచ్చాము. క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. అది ముందుకు సాగాలి. ఒక ఆటగాడు మంచి రాయబారిగా ఉండాలి. వారి దేశానికి ఇబ్బంది కలిగించే వ్యక్తిగా ఉండకూడదు" అని అఫ్రిది విలేకరులతో తన అసంతృప్తిని తెలిపాడు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్ ధవన్ సహా పలువురు ఇండియా వెటరన్ ప్లేయర్లు ఈ మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాచ్ కు ముందు రోజు ధావన్ తాను పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడననే తన నిర్ణయాన్ని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు రాసిన మెయిల్‌ను పంచుకున్నాడు. ఈ మెయిల్ లో రాబోయే WCL లీగ్‌లో పాకిస్తాన్ జట్టుతో జరిగే ఏ మ్యాచ్‌లలోనూ శిఖర్ ధావన్ ఆడడని ఇందులో ధృవీకరించబడి ఉంది. ఈ నిర్ణయం మే 11, 2025న వాట్సాప్ కాల్ ద్వారా ముందుగా తెలియజేయబడింది".బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సహ-యజమానిగా ఉన్న డబ్ల్యూసీఎల్ ఈ నెల 18న మొదలైంది. ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా ఉండగా, ధవన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా వంటి టాప్ క్రికెటర్లు జట్టులో ఉన్నారు.
Shahid Afridi breaks silence on India-Pakistan match fiasco pic.twitter.com/0OgrKhggSH
— SportsTiger (@The_SportsTiger) July 21, 2025
ఇండియా ఆటగాళ్లు పాక్‌తో ఆడటానికి నిరాకరించిన నేపథ్యంలో మ్యాచ్‌ను రద్దు చేసినట్టు డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్ ఏర్పాటు వల్ల ఇండియా టీమ్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తాను ఆడనని ధవన్ కూడా ప్రకటన చేయగా.. రాజ్యసభ ఎంపీ అయిన హర్భజన్ సింగ్, లోక్‌సభ ఎంపీ యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ కూడా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఈ టోర్నీలో పాక్‌తో ఆడేందుకు ఒప్పుకున్న ఇండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
Shahid Afridi: “Keep Cricket and Politics Apart” After India Refuses to Play Pakistan in WCL 2025pic.twitter.com/K8i6sYapJ8
— IndiaWarMonitor (@IndiaWarMonitor) July 20, 2025