ఆసియా బ్యాడ్మింటన్‌‌ చాంపియన్ షిప్‎లో షైనా, సుధాకర్‌‎కు స్వర్ణం

ఆసియా బ్యాడ్మింటన్‌‌ చాంపియన్ షిప్‎లో షైనా, సుధాకర్‌‎కు స్వర్ణం

చెంగ్డూ: ఇండియా యంగ్‌‌ షట్లర్‌‌ షైనా ముత్తుమణి, దీక్షా సుధాకర్‌‌.. బ్యాడ్మింటన్‌‌ ఆసియా అండర్‌‌–17, 15 చాంపియన్‌‌షిప్‌‌లో స్వర్ణాలతో మెరిశారు. ఆదివారం జరిగిన బాలికల అండర్‌‌–15 సింగిల్స్‌‌ ఫైనల్లో షైనా 21–14, 22–20తో చిహారు టొమిటా (జపాన్‌‌)పై గెలిచింది. ఫలితంగా ఇండియా తరఫున టైటిల్‌‌ నెగ్గిన నాలుగో ఇండియన్‌‌ ప్లేయర్‌‌గా రికార్డులకెక్కింది. 

44 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ప్లేయర్‌‌ తొలి గేమ్‌‌లో ఈజీగా ప్రత్యర్థికి చెక్‌‌ పెట్టింది. కానీ రెండో గేమ్‌‌లో గట్టి పోటీ ఎదుర్కొంది. అయినప్పటికీ కీలక టైమ్‌‌లో స్మాష్‌‌లు, ర్యాలీలతో వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు అదే జోరుతో గేమ్‌‌, మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది. అండర్‌‌–17 బాలికల ఫైనల్లో దీక్ష 21–16, 21–9తో లక్ష్య రాజేశ్‌‌పై నెగ్గింది.

తొలి గేమ్‌‌లో పోటీ ఇచ్చిన లక్ష్య.. రెండో గేమ్‌‌లో నిరాశపర్చింది. ఓవరాల్‌‌గా ఇండియా రెండు గోల్డ్స్‌‌, ఒక సిల్వర్‌‌, రెండు బ్రాంజ్‌‌ మెడల్స్‌‌తో టోర్నీని ముగించింది. ఇప్పటి వరకు ఈ చాంపియన్‌‌షిప్‌‌లో ఇదే బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌. 2013లో ఇండియా రెండు గోల్డ్స్‌‌ మెడల్స్‌‌తోనే సరిపెట్టుకుంది.