ఆకు కూరలు, కూరగాయలతో అమ్మవార్లు.. ఫొటోలు

ఆకు కూరలు, కూరగాయలతో అమ్మవార్లు.. ఫొటోలు

శ్రీశైల భ్రమరాంబికా దేవికి శాకాంబరీ ఉత్సవం

ఆకట్టుకున్న అమ్మవారు, దేవతల శాకాంబరీ రూపాలు

శ్రీశైల మహాక్షేత్రంలో ఇవాళ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబికా దేవికి శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. లోక కల్యాణాన్నికాంక్షిస్తూ భ్రమరాంబ అమ్మవారికి విశేషంగా ఉత్సవ సంబంధిత పూజాధికాలు నిర్వహించారు. సుమారు 30 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరీదేవికి, గ్రామదేవత అంకాళమ్మకు కూడా శాకాలంకరణ చేశారు. విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణానికి కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణ చేశామని పూజారులు తెలిపారు.