ఇళ్లు కట్టేందుకు మరో రూ.400 కోట్ల పెట్టుబడి

ఇళ్లు కట్టేందుకు మరో రూ.400 కోట్ల పెట్టుబడి

మూడో ఫేజ్‌‌ కోసం ఇన్వెస్ట్ చేయనున్నషాపూర్జి పల్లోంజి

న్యూఢిల్లీ: గురు గావ్‌ హౌసింగ్ ప్రాజెక్ట్‌‌ మూడో ఫేజ్‌ కోసం రూ. 400 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నామని షాపూర్జి పల్లోంజి రియల్ ఎస్టేట్‌ ప్లాట్‌ ఫామ్‌ జోవిల్‌ పేర్కొంది. కరోనా దెబ్బతో పడిన రెసిడెన్సియల్ ప్రాపర్టీల డిమాండ్‌ కిందటేడాది జూన్‌‌ నుంచి రికవరీ అవుతోందని పేర్కొంది. జోవిల్‌ హౌసింగ్ ప్లాట్‌ ఫామ్‌ ను షాపూర్జి పల్లోంజి, ఏడీబీ, ఐఎఫ్‌ సీ, యాక్టిస్‌ లు ఏర్పాటు చేశాయి. 2019 జనవరిలో 18 ఎకరాలలో గురుగావ్‌ హౌసింగ్‌‌ ప్రాజెక్ట్‌‌ మొదటి ఫేజ్‌ ను కంపెనీ స్టార్ట్ చేసింది. ఇదే ఏడాది జూన్‌‌లో రెండో ఫేజ్‌ ను మొదలు పెట్టింది. తాజాగా మూడో ఫేజ్‌ ను ప్రారంభించింది. మూడో ఫేజ్‌ లో 400 లకు పైగా ఇళ్లను కడతామని కంపెనీ పేర్కొంది. మొదటి ఫేజ్‌ కు మూడో ఫేజ్‌ కు మధ్య రేట్లలో తేడా ఉంటుందని తెలిపింది. మొదటి ఫేజ్‌ లో చదరపు అడుగును రూ. 5,800 కు అమ్మగా, మూడో ఫేజ్‌ లో చదరపు అడుగును రూ. 7,200 కు విక్రయించాలని కంపెనీ చూస్తోంది. ఈ మూడు ఫేజ్‌ లను కలిపి మొత్తం 1,500 ఇళ్లను కంపెనీ నిర్మించనుంది.