ఈడీ కేసులు ప్రతిపక్షాలపైనే : శరద్​ పవార్

ఈడీ కేసులు ప్రతిపక్షాలపైనే :  శరద్​ పవార్

పుణె: బీజేపీ నాయకులపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని... గతంలో కొందరిపై ఉన్న కేసుల విచారణ కూడా ఆగిపోయిందని శరద్​పవార్ ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నేతలపై ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఆదివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజ్యంగ వ్యవస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు సమర్థించరని చెప్పారు. అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఈసీ ‘గడియారం’ గుర్తును వారికి కేటాయించడంపై స్పందిస్తూ.. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. 2005 నుంచి 2023 వరకు ఈడీ 6 వేల కేసులు నమోదు చేసి, దర్యాప్తును పర్యవేక్షిస్తున్నదని.. అయితే ఇందులో 85% కేసులు ప్రతిపక్ష నాయకులకు  సంబంధించినవే అని స్పష్టంచేశారు.