Kapila Venu: గుడిలో నటి కపిల వేణుకు చేదు అనుభవం.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Kapila Venu: గుడిలో నటి కపిల వేణుకు చేదు అనుభవం.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

ప్రముఖ క్లాసికల్ డాన్సర్, నటి కపిల వేణు(Kapila Venu)కు చేదు అనుభవం ఎదురయ్యింది. తన స్నేహితురాలి డాన్స్ పర్ఫార్మెన్స్ చూడటం కోసం గుడికి వెళ్లగా అక్కడి వాలంటీర్లు ఆమెతో రూడ్ గా బిహేవ్ చేశారట. టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారట. ఆ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కపిల వేణు. దీంతో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక పోస్ట్ లో కపిల వేణు ఇలా రాశారు.. నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి లోకల్‌గా ఉన్న గుడికి వెళ్లాను. అప్పటికే అక్కడ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను. అది గమనించిన ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేస్తూ అడ్డుకున్నాడు. చాలా రూడ్‌గా మాట్లాడాడు. ప్రాబ్లమ్ అయితే చెప్పాలి కానీ, ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఆలా కాసేపు ఇద్దరి మధ్య వాదన జరిగింది. అంతలోనే మరో ఆరుగురు వాలంటీర్లు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కూడా నాదే తప్పుని చెప్పి, అక్కడినుండి వెళ్లిపోవాలని చెప్పారు.

ALSO READ | Divya Pillai: లిప్లాక్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు.. నటి దివ్య పిళ్ళై షాకింగ్ కామెంట్స్

దాంతో.. ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. కాసేపటికి కమిటీలోని మెంబర్ ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని లోపలికి పంపారు. నేను ఇంకేదో జరుగుతుంది అనుకున్నాను కానీ, మా నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపడం అనేది నిజంగా నాకు నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లడం అనేది నాది తప్పు. జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు వారిని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కూడా కష్టమే కదా. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది.. అంటూ రాసుకొచ్చారు కపిల వేణు.