ఎల్జీ బంపర్ బోణీ..48 శాతానికి గ్రే మార్కెట్ ప్రైజ్..

ఎల్జీ బంపర్ బోణీ..48 శాతానికి గ్రే మార్కెట్ ప్రైజ్..

ఎల్​జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు మంగళవారం మార్కెట్లో అడుగుపెట్టి 48 శాతానికి పైగా ప్రీమియంతో ముగిశాయి. ఇష్యూ ధర రూ. 1,140 ఉండగా, స్టాక్ బీఎస్​ఈలో రూ. 1,715 వద్ద, ఎన్​ఎస్​ఈలో రూ. 1,710.10 వద్ద లిస్ట్ అయింది.  ట్రేడింగ్​ ముగిసే సరికి రూ. 1,689.40లకు పడిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,14,671.81 కోట్లుగా నమోదైంది. రూ. 11,607 కోట్ల ఐపీఓకు చివరి రోజున 54.02 రెట్లు సబ్‌‌‌‌స్క్రిప్షన్ వచ్చిన విషయం తెలిసిందే.  

యూనిబిక్ ఫుడ్స్ సీఈఓ అజయ్ బతీజా 

కుకీ, బిస్కెట్ స్నాక్స్ కంపెనీ యూనిబిక్ ఫుడ్స్ తమ కొత్త సీఈఓ గా అజయ్ బతీజాను నియమించింది. ఎఫ్​ఎంసీజీ డ్రింక్స్​పరిశ్రమలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న అజయ్, ఇంతకుముందు  కోకా-కోలా కంపెనీలో 18 ఏళ్లకు పైగా సేవలు అందించారు. అజయ్ యూనిబిక్ వ్యూహాత్మక వృద్ధిని, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార విస్తరణను నడిపిస్తారు.యూనిబిక్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ, బ్రాండ్ నిర్మాణం, వినియోగదారుల మార్కెటింగ్‌‌‌‌లో అజయ్ అనుభవం యూనిబిక్‌‌‌‌కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.