
హైదరాబాద్ : తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్నదే తన కోరికని.. మీరంతా తోడుంటే అది సాధ్యమన్నారు.. వైఎస్.షర్మిల. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పనిచేశారని గుర్తుచేశారు. లోటస్ పాండ్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు షర్మిల. ప్రతి రైతు రాజు కావాలని.. ప్రతి పేదవాడు లక్షాదికారి కావాలని.. ప్రతి పేద విద్యార్థి ఉచితంగా చదువుకోవాలని వైఎస్ కోరుకున్నాడని చెప్పారు షర్మిల. అనారోగ్యం వచ్చిన వారికి భరోసా కల్పించాలని ఆశించారని తెలిపారు. తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు శర్మిల. సమావేశంలో జై తెలంగాణ అంటూ నినదించారు.