
సీఎం కేసీఆర్ కు మహిళాదినోత్సవం రాగానే మహిళలు గుర్తొచ్చారంటూ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. సున్నా వడ్డీకే రుణాలిస్తామన్న కేసీఆర్.. మూడేండ్లుగా 4 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పైగా మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ మరోసారి మోసం చేశారని ఆరోపించారు. ఇపుడు పట్టుమని రూ. 750 కోట్లు రిలీజ్ చేసి మహిళలపై మరోసారి కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ తీరుతో మహిళలే ఆపసోపాలు పడి.. బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని షర్మిల విమర్శించారు. మహిళల పట్ల కేసీఆర్ కు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా రూ. 4వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.750 కోట్లు రిలీజ్ చేసినందుకు చిన్నదొరకు కృతజ్ఞత చెప్పడం మానేసి.. కేసీఆర్ ముక్కు పిండి బకాయిలు వసూలు చేయించాలని సూచించారు.