వరద ప్రభావిత ప్రాంతాల్లో 21 నుంచి షర్మిల పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో 21 నుంచి షర్మిల పర్యటన

హైదరాబాద్, వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్​టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. 21 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడనున్నట్లు మంగళవారం పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 21న  ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ పార్టీ ఆఫీస్ నుంచి బయలు దేరి నేరుగా మంచిర్యాల వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పోషయ్య గూడెం వెళ్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల పట్టణంలో వరదల కారణంగా ఎఫెక్ట్ అయిన కాలనీలను సందర్శిస్తారు. రామగుండం పట్టణాన్ని పరిశీలించి.. నైట్ అక్కడే బస చేస్తారు. 22న రామగుండం నుంచి బయల్దేరి మంథనిలో  రైతులతో మాట్లాడి, 2.30 గంటలకు అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్ లను పరిశీలించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మహబూబాబాద్​ జిల్లా బయ్యరంలో బస చేస్తారు. 23న బయ్యారంలోని రెడ్డి పాలెంలో బాధితులతో మాట్లాడి, బూర్గంపాడు  నుంచి భద్రాచలం వెళ్తారు. 

దేవాదుల లిఫ్ట్ చెక్కు చెదరలే
18 ఏండ్ల కింద వైఎస్ఆర్ హయాంలో కట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా పనిచేస్తుంటే, లక్షల కోట్లు అప్పు తెచ్చి మరీ కేసీఆర్  కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కన్నెపల్లి, అన్నారం పంపు హౌస్ లు రెండేండ్లు కాకుండానే మునిగిపోయాయని మంగళవారం షర్మిల ట్వీట్ చేశారు. వెలుగులో పబ్లిష్ అయిన క్లిప్ ను ట్వీట్ లో షేర్ చేశారు.  13లక్షల క్యూసెక్కుల వరదకు అన్నా రం పంపుహౌస్ 28 లక్షల క్యూసెక్కుల వరదకు కన్నెపల్లి పంపుహౌస్ మునిగితే, 29.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దేవాదుల పంపు హౌస్ చెక్కుచెదరలేదని గుర్తు చేశారు.  రికార్డ్ వరదను సైతం తట్టుకొని దేవాదుల నిలబడిందన్నారు.  సమ ర్థత గల నాయకుని పనితీరుకు నిదర్శనం వైఎస్ఆర్ దేవాదుల అని, అవినీతికి నిదర్శనం కేసీఆర్ కాళే శ్వరం అని షర్మిల విమర్శించారు.