ఆగిపోయిన చోట నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న షర్మిల

ఆగిపోయిన చోట నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న షర్మిల
  • వాయిదాపడ్డ కొండ‌‌‌‌పాక‌‌‌‌గూడెం గ్రామం నుంచే ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: “కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎన్నో స‌‌‌‌మ‌‌‌‌స్యలు వేధిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామ‌‌‌‌కాలు కల్పించ‌‌‌‌డంలో కేసీఆర్ ప్రభుత్వం అడుగ‌‌‌‌డుగునా ఫెయిల్ అయింది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేవని ఎంతో మంది నిరుద్యోగులు తనువు చాలించారు. రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటివి అమలు కావడం లేదు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. గ్రామాలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోంది. మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు’’ అని వైఎస్ ఆర్​టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేవెళ్ల నుంచి 2021 అక్టోబర్ 20వ తేదీన మొదలుపెట్టారు. 21 రోజుల పాటు కొనసాగించారు. మ‌‌‌‌ధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా వల్ల 2021 నవంబరు 9న వాయిదా వేశారు. 21 రోజుల్లో ఏడు నియోజకవర్గాల్లోని 15 మండ‌‌‌‌లాలు, 5 మున్సిపాలిటీలు, 122 గ్రామాల్లో 237.4 కిలోమీట‌‌‌‌ర్ల పాదయాత్ర చేశారు. 
నార్కట్​పల్లిలో మీటింగ్
ప్రజాప్రస్థానం యాత్ర నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీసు నుంచి షర్మిల  బయలుదేరి, మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం, 4.15గంటలకు చిన్న నారాయణపురం, 5 గంటలకు నార్కెట్ పల్లి చేరుకొని అక్కడ మీటింగ్ నిర్వహించి, ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు మడ ఎడవెల్లి గ్రామానికి చేరుకుంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకుని, ప్రజలతో మాట్లాడతారని పార్టీ వెల్లడించింది.