శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం జరిగింది.
శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ చెప్పారు. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో సంక్రాంతి బరిలో సూపర్ హిట్స్ అందుకున్న శర్వానంద్.. మరోసారి ఈ సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రావాలని ఫిక్స్ అయ్యాడు.
ఇందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే శ్రీను వైట్ల మూవీ షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు.
