ప్రపంచం ఎంతో ముందుకు పోతున్నా మూఢనమ్మకాలు అనేవి ఇంకా మనుషుల్లో పోవడం లేదు. హైదరాబాద్ సనత్నగర్లోని అల్లాదున్ కోటిలో మూఢనమ్మకాలతో ఓ బాలుడుని ఓ హిజ్రా బలి ఇచ్చింది. బలైన బాలుడిని 8 ఏళ్ల అబ్దుల్ వహీద్ గా గుర్తించారు. అమవాస్య రోజున ఆ మహిళ ఆ బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
బాలుడి మృతదేహం మహిళ ఇంటి సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. దీంతో మహిళ ఇంటిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
