గొర్రెల పంపిణీకి రూ. 93.76 కోట్లు

గొర్రెల పంపిణీకి రూ. 93.76 కోట్లు

గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2వేల యూనిట్లు, నల్గొండ జిల్లాలో 5వేల 600 యూనిట్లకు ఇది వర్తించనుంది. ఈ మేరకు మొత్తం 7 వేల 600 మంది లబ్దిదారులకు సంబంధించిన 93 కోట్ల 76 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ఖాతాలో వేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక కోసమే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ స్కీంను నగదు బదిలీకి మార్చిందని విమర్శలు వస్తున్నాయి. అందుకే కేవలం 2 జిల్లాలకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రతిపక్షనేతలు అంటున్నారు.

ఇక మునుగోడు ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 7వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14. నామినేష‌న్లను 15వ తేదీన ప‌రిశీలించ‌నున్నారు.నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 17. న‌వంబ‌ర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వహించి, 6న ఫ‌లితాల‌ను వెల్లడించ‌నున్నారు.